వివాహం ఆలస్యం కావడానికి కారణాలు

4/8/20261 min read

ఈ మధ్య కాలంలో తమ పిల్లల వివాహాలు ఆలస్యం కావడం తల్లితండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నది. ఇందుకు మొదలు జ్యోతిష పరంగా కారణాలు చూద్దాము.

జ్యోతిషశాస్త్రం ప్రకారం వివాహం ఆలస్యంగా జరగడానికి అనేక గ్రహస్థితులు, దోషాలు, దశలు కారణమవుతాయి. ఇవి ముఖ్యంగా 7వ భావం (వివాహ భావం), శుక్రుడు (వివాహ కారకుడు), గురువు (స్త్రీలకు ముఖ్యంగా), అలాగే దశ, అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ముఖ్య కారణాలను సులభంగా అర్థమయ్యే విధంగా చూద్దాం!.

వివాహానికి జన్మ జాతకంలో 2, 7, 11 భావాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. 2 వ భావం కుటుంబం, 7 వ భావం వివాహం, 11 వ భావం అనుకున్నది కావడం సూచిస్తాయి. స్త్రీలకు 8 వ భావం కూడా చూడాలి. ఇది భర్త ఆయుష్యు ను సూచిస్తుంది. మగవారికి శుక్రుని బలం , స్త్రీలకు కుజుని బలం, మొత్తంగా గురు బలం చూడాలి.

2, 7, 8 భావాలలో ఉన్న గ్రహం కానీ, భావాధిపతి కానీ ఒకటి వక్రంగా (retrograde) ఉంటే పెళ్లి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పెళ్లి జరుగుతుంది కానీ ఆలస్యం అవుతుంది.

7 వ భావానికి శని, కుజ, రాహు, కేతువుల ప్రభావం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. 7 వ భావఅధిపతి నీచ పడినా, అస్తoగత్వం చెందినా ఆలస్యం అవుతుంది. 7 వ భావాధిపతి 6 లేక, 8 లేక, 12 భావాలలో ఉన్నా ఆలస్యం అవుతుంది. వివాహం తరువాత కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది.

శని కి 7 వ భావంతో సంబంధం ఉన్నా, లేక దృష్టి ఉన్నా, శుక్ర –శని సంయోగం ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. కానీ వివాహ బంధం దీర్ఘ కాలం ఉంటుంది.

శుక్రుడు నీచ పడినా, అస్తoగత్వం చెందినా వివాహం ఆలస్యం అవుతుంది. పురుషులకు ఇది చాలా ముఖ్యం. గురువు నీచపడినా లేదా దోష పూరితంగా ఉంటే స్త్రీలకు మంచి వరుడు రావడం ఆలస్యం అవుతుంది.

రాహువు కానీ, కేతువు కానీ 7 వ భావoలో ఉన్నా, సంభంధం ఉన్నా వివాహానికి అడ్డంకులు ఏర్పడతాయి.

నవాంశలో 7 వ భావం లేదా శుక్రుడు బలహీన పడితే వివాహం ఆలస్యం అవుతుంది.

లగ్నాధిపతి వక్రంగా ఉంటే కొంత ఆలస్యం- (minor delay). కానీ 2వ / 7వ / 8వ అధిపతులు వక్రం అయితే చాలా ఆలస్యం (major delay).

గ్రహస్థితుల కంటే కర్మ ఫలితంగా ఆలస్యం అవుతుంది. కానీ ఎక్కువ సార్లు ఆలస్యం అయినా స్థిరమైన వివాహ జీవితం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జ్యోతిషం జాతకాల ప్రకారం కొన్ని సూచనలు ఇస్తుంది. అవి guidance మాత్రమే! . మరిన్ని వివరాలు వచ్చే పోస్ట్ లో.. శుభం

Get in Touch

Connect with us for trusted

Vedic guidance and personalized solutions

Email:

WhatsApp:

© 2026 Sree Shaivi Jyothisham. All rights reserved.

+91-9640564639

Sree SHAivi Jyothisham

Important Links